Advertisement
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా పలు సినిమాలలో నటించిన నటి సుధ ఉదయ్ కిరణ్ పై ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Advertisement
ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయి ఉంటారని యాంకర్ ప్రశ్నించగా, అతడిని ఎవరో బాగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఉంటారని ఆమె తెలిపింది. అది ఎవరన్నా తాను పాయింటు అవుట్ చేయలేదని తెలిపారు. ఉదయ్ కిరణ్ ఎంతో క్షోభ అనుభవించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో బాధపడి ఉంటాడని, కొంతమంది ఎన్ని కౌన్సిలింగ్ తీసుకున్న కూడా, కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడే బాగుంటుందని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి అదే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు సుధ.
Advertisement
చివరి రోజుల్లో ఉదయ్ కిరణ్ తనను కలవలేదని ఆమె తెలిపారు. తన అసిస్టెంట్ ను పంపించినా కూడా కలిసేవాడు కాదని ఇంట్లోనే ఉండి కూడా కలవలేదని చెప్పారు సుధా. తాను ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకుందామని అనుకున్న అని ఆమె చెప్పింది. ఒకవేళ నిజంగానే ఉదయ్ కిరణ్ ను నేను దత్తత తీసుకుంటే, పుత్ర శోకం తాను అనుభవించాల్సి వచ్చేదేమో అంటూ ఎమోషనల్ అయింది సుధ. రెండు నెలలలో ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకోవాల్సిందని కానీ, కొన్ని పరిస్థితితుల కారణంగా అది జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. చివరి రోజుల్లో తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని ఏడ్చారని ఆమె చెప్పింది. నేను ఒంటరవుతున్నా అంటూ ఏడ్చాడని, తాను బిజినెస్ పెట్టిస్తానని చెప్పినా ఉదయ్ కిరణ్ వినలేదని సుధా వివరించారు.
read also : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు !