Advertisement
టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చూసిన చాలా ఎమోషనల్ గా ఉంటాయి. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా, సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి. ఈ పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.
Advertisement
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఓ సాంగ్ లో కొద్దిసేపు నటించడం ఈ సినిమాకు హైలెట్. అలాగే కీమ్ శర్మ కూడా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం దర్శకుడు తో బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిన సీన్ ఉంది. సంగీత రవితేజను ఇష్టపడుతున్న సంగీత అమ్మ తన కూతురును హీరోయిన్ చేయాలన్న పిచ్చితో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీత ఆదర్శకుడితో పక్కలోకి వెళుతుంది. అయితే రవితేజ తలుపు తోసుకొచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు.
Advertisement
సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని, కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది. అప్పట్లో ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం ఏమిటంటే టాలీవుడ్ లో ఓ సీనియర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఈ సీన్ కావాలని పెట్టారని అంటారు. నిజ నిజాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ స్టార్ డైరెక్టర్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్ లో ఇబ్బంది పెట్టిన క్రమంలోనే, కృష్ణవంశీ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ నటి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే తప్పకుండా దర్శక, నిర్మాతలకు లొంగి పోవాల్సిందే అని, వారు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
Also Read: ‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..