Advertisement
సాధారణంగా మన బాల్య స్నేహితులను మనం అంత త్వరగా మరచిపోలేము. బాల్యంలో మనకు ఎలాంటి కల్మషాలు ఉండవు. ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు మన ఆలోచనల్లో ఉండవు. స్వచ్ఛమైన మనసుతో ఉంటాము. మరియు అటువంటి వ్యక్తులతోనే స్నేహం చేస్తుంటాము. అలా మొదలైన స్నేహాన్ని మనం అంత త్వరగా మరచిపోలేము. జీవితాంతం మనకి వారు గుర్తుంటారు. అలాంటి స్టోరీ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి తన చిన్ననాటి స్నేహితురాలిని దాదాపు పదిహేనేళ్ళు దాటిపోయాక తన స్నేహితురాలిని ఎలా అయినా కలుసుకోవాలని అనుకుంది.
Advertisement
ఆ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ అమ్మాయి పేరు వేదిక. ఆమె స్నేహితురాలి పేరు బర్నాలి. బర్నాలి & నా కిండర్ గార్టెన్ రోజుల నుండి ఓ ఫోటోను పంచుకుంటున్నా అంటూ వేదిక తన పోస్ట్ ని ప్రారంభించారు. మేము మొదటి కలుసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. 2007లో నా కుటుంబం అప్పుడే హైదరాబాద్‌కు వెళ్లింది. నా వయస్సు 5 సంవత్సరాలు. కొత్త పాఠశాలకి వెళ్ళడానికి నేను చాలా భయపడ్డాను. కానీ నేను బర్నాలీని ప్లేగ్రౌండ్‌లో కలిశాను. నేను ఆమెను ‘మీ పేరు ఏమిటి?’ అని అడిగాను, ఆమె తన పేరు చెప్పి, నా పేరు అడిగింది. అలా పేర్లు తెలుసుకున్నాక నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. తాను లేదు అని సమాధానమిచ్చింది. ఆ తరువాత మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము..” అని వేదిక తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
Advertisement
అప్పటినుంచి మేము కలిసే క్లాస్ లకు వెళ్ళేవాళ్ళం, ఒకే బెంచ్ పై కూర్చునే వాళ్ళం. మా పేరెంట్స్ మాకు ఇచ్చిన బాక్స్ లోని ఫుడ్ ను షేర్ చేసుకుంటూ తినేవాళ్ళం అని వేదిక చెప్పుకొచ్చారు. ఒకసారి మా పేరెంట్స్ తిరిగి సిటీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. హడావిడిగా లగేజ్ సర్దుకుని వెళ్లిపోయాం. బర్నాలికి కనీసం బాయ్ కూడా చెప్పలేదు. అలా అని నేను ఆమెని మర్చిపోలేదు. నేను కొత్త స్కూల్ కి మారాక నా ఫ్రెండ్స్ కి ఆమె గురించి చెప్పాను. ఆ తరువాత ఆమెని కలుసుకోవడం కుదరలేదు. పదిహేనేళ్ళు గడిచిపోయాయి. ఓరోజు ఉదయం మా తమ్ముడు డోర్ మాన్ చూస్తున్న సమయంలో షిజుకా తన బెస్ట్ ఫ్రెండ్‌తో మళ్లీ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నట్లు మాటలు విన్నాను.
దీనితో నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కలుసుకోవాలని అనుకున్నాను. వెంటనే లింక్డ్ ఇన్ లో ప్రయత్నించాను. అందులో పేరు టైపు చేయగా వచ్చిన మొదటి అమ్మాయి నాకు దగ్గరైన అమ్మాయిగా అనిపించింది. ఆమెను పలకరించి ఆమెకు మా చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాను. ఒక నిమిషం ఆశ్చర్యపోయినా, ఆమె నన్ను గుర్తు పట్టింది. మేము ఒకరి నంబర్స్ ఒకరు తీసుకుని అన్ని విషయాలను ముచ్చటించుకున్నాము. 15+ సంవత్సరాలుగా గడిచిన మా జీవితం గురించి చర్చించుకున్నాం. బర్నాలి కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి మారారు & నేను పూణేలో నివసిస్తున్నాను. మేము మా పరీక్షల తర్వాత కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాం. ఇకపై మేము రోజు కలిసి ఉండకపోయినప్పటికీ.. కచ్చితంగా ఒకరి జీవితంలో మరొకరం ఉంటాం.” అంటూ వేదిక తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.