Advertisement
భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ సీజన్ ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు అందరిచూపు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పడింది. లీగ్ 16వ సీజన్ లో గత సీజన్ విజేత గుజరాత్ టైటాన్స్ వైపే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అందులోను విపరీతమైన ఫామ్ లో ఉన్న గిల్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ప్లేయర్ల ఆట తోడవడంతో 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఎదురేలేకుండా పోయింది. ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
READ ALSO : TSPSC paper leakage : రేణుక ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి!
2022 సీజన్ ముంబై ఇండియన్స్ కు పీడకల లాంటిది. కీలక ప్లేయర్లను కోల్పోయిన తర్వాత కొత్త జట్టుతో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం ముంబై మరోసారి ఛాంపియన్ ఆటను ప్రదర్శించే అవకాశం ఉంది. గత సీజన్ లో తృటిలో టైటిల్ ను చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ మాధురే జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. సంజు సామ్సన్ కెప్టెన్సీ లోని రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది.
Advertisement
READ ALSO : భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్…!
ఇక ఈ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతోంది. గత సీజన్ లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అనంతరం జట్టును పూర్తిగా మార్చేసింది. యువ ప్లేయర్ మార్క్రమ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్ప చెప్పింది. వేలంలో మయాంక్ అగర్వాల్, హ్యరీబ్రూక్, క్లాసేన్, ఆదిల్ రషీద్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఇక బౌలింగ్ భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లతో పటిష్టంగా ఉంది. డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఎవరు ఊహించని విధంగా ఐపిఎల్ 16వ సీజన్ టైటిల్ ను గెలిచే అవకాశం లేకపోలేదు.
READ ALSO :Rajinikanth Wife Latha Love Story: రజినీకాంత్ జీవితం మారిపోవడానికి భార్య లతా చేసిన ఒక్క పని ఏంటంటే