Advertisement
మరో నెల రోజుల్లో ఐపీఎల్ జోరు ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే చాలా ప్రాంచైజీలు తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ కూడా పెట్టాయి. ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. పలువురు ఆటగాళ్లకు గాయాల సమస్య వేధిస్తోంది. దీంతో కొంతమంది ఆటగాళ్లు లీగ్ మిస్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4గురు ఆటగాళ్లు టోర్నమెంట్ కు దూరమవగా.. మరికొందరి పరిస్థితి అయితే ఐపీఎల్ లో పాల్గొంటారో లేదో అనే సందేహంలో పడింది. మరో నెల రోజుల్లో వీరంతా పూర్తిగా కోలుకుంటేనే ఐపీఎల్ లో ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పటివరకు ఐపీఎల్ నుంచి అవుట్ అయిన ప్లేయర్ల లిస్టు ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
#1. కైల్ జమీసన్( చెన్నై సూపర్ కింగ్స్ )
న్యూజిలాండ్ పెసర్ కైల్ జమీషన్ వెన్ను నొప్పి కారణంగా గత ఎడాది జూన్ లో జాతీయ జట్టుకు దూరమయ్యారు. ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఐపీఎల్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.
#2. రిషబ్ పంత్ ( ఢిల్లీ క్యాపిటల్స్ )
టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ కోలుకోవడానికి ఏడాది పైన పట్టచ్చు. ఆయన కూడా ఐపీఎల్ కు దూరమవ్వనున్నాడు.
#3. జస్ ప్రీత్ బూమ్రా ( ముంబై ఇండియన్స్)
వెన్ను నొప్పితో బాధపడుతున్న టీమిండియా ఫేసర్ బూమ్రా ఈసారి ఐపీఎల్ కి దూరం కావడం ఖాయం అన్నట్టు తెలుస్తోంది.
Advertisement
also read: ప్రజలారా అలర్ట్..కొత్త నిబంధనలు వచ్చేశాయి.. ఏంటంటే..?
#4. ప్రసిద్దు కృష్ణ ( రాజస్థాన్ రాయల్స్)
ఈ ప్లేయర్ కూడా చీలమండ నొప్పి కారణంగా ఇటీవల శస్త్ర చికిత్స చేసుకున్నారు. అందుకే ఈయన కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున కనిపించే అవకాశం లేదు.
#5. జోష్ లిటిల్ ( గుజరాత్ టైటాన్స్)
ఐపీఎల్ లో అరంగేట్రం చేయాలని ఆశించిన ఐర్లాండ్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఫిషర్ జోష్ లిటిల్ తొడ కండరాలు పట్టేయడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి నిష్క్రమించాడు. మార్చి నెలాఖరు లోగా ఐపీఎల్ లో కనిపించే అవకాశం కనిపిస్తోంది.
also read:
#6. ఫ్యాట్ కమిన్స్ ( కోల్కత్తా నైట్ రైడర్స్ )
టీమిండియాతో జరిగే సిరీస్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ దూరమైన విషయం తెలిసిందే. అతని తల్లి అనారోగ్యం బారిన పడటం వల్ల సిరీస్ మధ్యలోనే వదిలేసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు. ఐపీఎల్ కి రావడం కూడా అనుమానంగానే ఉంది.
also read: