Advertisement
ఐసీసీ టి – 20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ఎదురుచూపులు ఫలించలేదు. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక, కనీసం ఒక్క వికెట్ నైనా పడగొట్టలేక 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే భారత జట్టు ఆట తీరును విమర్శిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు భారత జట్టుపై అక్కస్సును వెళ్ళగకుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత జట్టును విమర్శిస్తూ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Read also: ఆర్య సినిమాలోని గీత మరీ ఇంతలా మారిపోయిందా..?
“152/0 vs 170/0” అని ట్వీట్ చేశాడు షహబాజ్ షరీఫ్. అంటే.. 150/0 గతేడాది టి – 20 ప్రపంచ కప్ లో భారత్ పై పాకిస్తాన్ చేసిన చేజింగ్ స్కోర్. టి – 20 ప్రపంచ కప్ టోర్నీలలో భారత్ పై వికెట్ కోల్పోకుండా విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈసారి ఫైనల్ లో తలపడుతున్నాయని అర్థం. ఇలా టీమ్ ఇండియాని విమర్శిస్తూ పాక్ ప్రధాని ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ఈ ట్వీట్ పై భారత అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో పాక్ ప్రధానికి రిప్లై ఇచ్చాడు.
Advertisement
“మీకు మాకు తేడా ఇదే.. మేము గెలిచినా, ప్రత్యర్థి గెలిచినా మేము సంతోషిస్తాం. కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షస ఆనందం పొందుతున్నారు. మేము మా పట్ల ఆనందంగానే ఉన్నాము. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకొని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి. మీ దేశం పట్ల, మీ ప్రజల బాగోగుల పట్ల మీరు దృష్టి సారించలేకపోతున్నారు” అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇర్ఫాన్ పటాన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: ఆస్ట్రేలియా టూర్‌లో గర్ల్‌ఫ్రెండ్ అతియా షెట్టితో కేఎల్ రాహుల్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్