Advertisement
తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కదనరంగంలోకి దిగుతున్నాయి. ఓవైపు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం పై ధీమాగా ఉంటే.. ఈ సారి గెలుపు తమదేనని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో బీజేపీ మేము సైతం అంటూ రంగంలోకి దిగుతోంది. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వరాల జల్లు కూడా కురిపించారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరు..? కాంగ్రెస్ పుంజుకుంటుందా..? అధికార బీఆర్ఎస్ బలహీన పడిందా..?
Advertisement
ఇవి కూడా చదవండి: బిఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్స్ దూరం అవుతున్నారా?
బీజేపీ కూడా ధీమాగా ఉందా.? ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పుంజుకుంటుందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంపై ఆశలను పెంచుకుంది. అయితే బీజేపీ కూడా కొన్ని చోట్ల విజయం సాధించే అవకాశముంది. బీజేపీ కోసం ఢిల్లీ నేతలు తెలంగాణకు విచ్చేస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇలా వరుస పర్యటనలు చేస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: సిబిఎన్ అడ్డా కుప్పంలో హీరో విశాల్ మూడేళ్ళ గ్రౌండ్ వర్క్ ఎందుకు చేసారు?
కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే బలంగా ఉన్నారు. ఇక రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ కి పోటీగా నిలిచే నేత తెలంగాణలో ఎవ్వరూ లేరనేది వాస్తవం. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగులకు కూడా వరాలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్ లకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ మేనిఫెస్టో దసరా పండుగ రోజు ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. మరోవైపు పాజిటివ్ ఓటు బ్యాంకును నమ్ముకున్న కేసీఆర్.. దక్షిణ భారతదేశంలో తొలిసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సీఎంగా సరికొత్త రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలపై పెట్టుకున్న నమ్మకం ఫలిస్తుందా..? లేదా అనేది డిసెంబర్ లో తేలనుంది.
ఇవి కూడా చదవండి: నారా బ్రాహ్మణిపై ఎమ్మెల్యే రోజా ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు? అసలు కారణం ఏంటంటే?