Advertisement
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా వున్నారు. అల్లు అర్జున్ గత కొన్ని ఏళ్లుగా ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఊహించని విధంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా బన్నీ కెరియర్ లో భారీ ఫ్లాప్ ని ఇచ్చింది. అల వైకుంటపురంలో సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమాకు సరిలేరు నీకెవరు సినిమా గట్టి పోటీ ఇచ్చింది. సోలో రిలీజ్ దక్కి ఉంటే కలెక్షన్లు భారీగా ఉండేవి. పుష్పా ది రైజ్ మూవీ టైం లో టికెట్ల రేట్ల వలన బన్నీ సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాలో నష్టాలు వచ్చాయి.
Advertisement
పుష్ప టు సినిమా టార్గెట్ వెయ్యి కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ టార్గెట్ ను బన్ని సాధించడం సులువైన విషయం కాదు. తెలుగు రాష్ట్రాలలో సినిమాకు టికెట్ రేట్ల పెంపు వస్తుందో రాదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఈ మూవీ విషయంలో ఎలా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది.
Advertisement
Also read:
Also read:
పుష్ప టు సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తోంది. పుష్ప ది రూల్ రిలీజ్ సమయానికి పవన్ బన్నీ మధ్య గ్యాప్ తగ్గి పరిస్థితి మారొచ్చేమో చూడాలి. డిసెంబర్ ఆరవ తేదీన పుష్ప టూ రిలీజ్ కాబోతోంది. మరి ఎలా రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!