Advertisement
Allu arjun : ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డులో బెస్ట్ యాక్టర్ గా పుష్ప సినిమాలో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ కేటగిరిలో సౌత్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సూర్య నామినేట్ కాగా, అవార్డు రూపంలో ఆ అదృష్టం అల్లు అర్జున్ ని వరించింది. దీంతో తెలుగు హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశారు. ఇక అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు దక్కించుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.
Advertisement
అదేంటంటే.. ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ఇవ్వటం ఏంటి..? ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ తో పోలిస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అంతా సూపర్ ఏమి కాదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులుగా స్మగ్లింగ్ చేసే పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వకూడదా..? అలాంటి రూల్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయానికి వస్తే.. 1963లో జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో నర్తనశాలలో కీచక పాత్ర పోషించినందుకు ఎస్వీ రంగారావు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఒక భారతీయ నటునికి నటనలో అంతర్జాతీయ అవార్డు లభించడం ఇదే తొలిసారి.
Advertisement
నర్తనశాలలో హీరో ఎన్టీఆర్ అయినప్పటికీ ఉత్తమ నటుడుగా అవార్డు మాత్రం ఎస్వీఆర్ కి వచ్చింది. ఒక యాక్టర్ ని నటనపరంగా అవార్డులకు సెలెక్ట్ చేస్తారే కానీ అతను ఏ క్యారెక్టర్ నటించాడు అనేదానికి మాత్రం కాదు అని చాలామంది తెలుసుకోవలసిన విషయం. ఎప్పుడో ఇంటర్నేషనల్ అవార్డు పొందిన ఎస్వీఆర్ గారి గురించి ఇప్పటికి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అదే మన తెలుగు హీరోకి మన దేశంలోనే అవార్డు రావడాని చాలామంది తప్పుపడుతున్నారు.
ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి వాళ్లకు వాళ్ళు ప్రశ్నించుకుంటే మంచిది. తెరపై కనిపించిన నటుడు ఎంత గొప్పగా నటించాడో అనే విషయాన్ని అవార్డులు ఇచ్చే వారు పరిగణలోకి తీసుకుంటారు. అంతేకానీ వారు ఎటువంటి క్యారెక్టర్ లో నటించారనేది ముఖ్యం కాదు అని తెలుసుకోవాలి. నటుడు సంపాదించిన అవార్డును గొప్పగా చెప్పుకోవాలి కానీ.. విమర్శించడం అంత మంచి పద్ధతి కాదని చాలామంది అర్థం చేసుకోవాలి.
Also Read :
టాలీవుడ్ లో ఎంతో టాలెంటెడ్ యాక్టర్ బెనర్జీ తండ్రి కూడా యాక్టర్ తెలుసా ? ఎవరంటే ?