Advertisement
నేలమీద కూర్చుని చాలా మంది భోజనం తింటూ ఉంటారు. అలానే కొంతమంది రాత్రి నిద్రపోయేటప్పుడు నేల మీద నిద్రపోతూ ఉంటారు. అయితే నేల మీద నిద్ర పోవడం వలన మంచిదా కాదా..? ఏం జరుగుతుంది అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది మంచం మీద నిద్రపోవడం వలన వెన్ను నొప్పి వస్తుంది అని నేల మీద నిద్రపోతూ ఉంటారు. అలా చేస్తే నొప్పి తగ్గుతుందని నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నేల మీద కూర్చుని భోజనం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
Advertisement
నేలపై పడుకుంటే ఏమవుతుంది అనేది చూస్తే.. మంచం మీద నిద్రపోవడం వలన వెన్నునొప్పి వస్తుంది అని చాలామంది నేల మీద నిద్రపోతూ ఉంటారు. కానీ అది నిజం కాదు మంచంపై పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. నడుం నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏమీ రావు. నేల మీద నిద్రపోతే నొప్పులు తగ్గుతాయనడంలో ఏమాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి నేల మీద నిద్రపోవడం వలన వెన్నునొప్పి అస్సలు తగ్గదు. దీంతో ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Advertisement
Also read:
నేలపై పడుకోవడం వలన వెన్నుపై ఎక్కువ ప్రభావం పడుతుంది. గట్టిగా ఉండే నేల ఉపరితలంపై నిద్రపోవడం వలన వెన్నెముక దాని సహజ వక్రతను నిర్వహించడానికి తగినంత మద్దతు ఉండదు. దీనితో వెన్ను అమరిక దెబ్బతింటుందని కూడా ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!