Advertisement
సాధారణంగా మనలో చాలా మంది రోడ్డుపై వెళ్తుండగా ధనం దొరికితే బాగుంటుందని కలలు కంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. అయితే భారీగా డబ్బు సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చూస్తారు. పడేసుకున్న వారు అక్కడ ఎవరూ లేరు అనుకుంటే ఆ డబ్బులు తీసుకొని జేబులో వేసుకోవడమో, లేదా అక్కడ ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఇవ్వడమో, లేదంటే డబ్బుని దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడి హుండీలో వేయడం చేస్తుంటారు.
Advertisement
Read also: రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?
Advertisement
డబ్బు దొరకడం ఎలాంటి అర్ధాన్ని ఇస్తుంది, అలా దొరకడం అదృష్టమా? లేక దురదృష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు రోడ్డున దొరకడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. పడిన ధనాన్ని పొందడం పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు. రోడ్డుపై డబ్బు దొరికితే మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. దేవుడు మీ పట్ల దయతో ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రోడ్డుపై కాయిన్స్ దొరికితే శుభవార్త వింటారని అర్థం. ఇలా డబ్బు దొరికిన తర్వాత మీరు పూర్తి శ్రమతో పని చేస్తే కచ్చితంగా దాని ఫలితాన్ని పొందుతారు.
ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతున్న సమయంలో దారిలో పడిపోయిన నాణెం, లేదా నోటు కల్పిస్తే తీసి దాచుకోవడమే మంచిది అంటున్నారు. అలా చేస్తే కచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతం అంటున్నారు. అలా ధనం దొరికితే త్వరలోనే కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉందని సూచిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉందని అర్థం. అలా దొరికిన డబ్బుని దేవాలయంలో దానం చేయడం కూడా మంచిదే. లేదా ఇంట్లో ఎక్కడైనా దాచుకోవచ్చు. కానీ ఆ డబ్బులు ఖర్చు చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Read also: త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే ?