Advertisement
సబ్జా గింజలు మనం నీటిలో వేయగానే ఉబ్బి జల్ గా తయారవుతాయి. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలేట్ తో అందాన్ని అందించే పెంచే విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
Advertisement
దీనివల్ల మాటిమాటికి ఆకలి వేయదు. జిగురు లా ఉండే ఈ సబ్జా గింజల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గించి, మలమూత్ర సమస్యలను నివారిస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్ని కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బ తగిలితే ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలపై రాసుకోవడం వల్ల దెబ్బ త్వరగా తగ్గుతుంది.
Advertisement
తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్ళలో కలుపుకొని తాగితే సమస్య ఇట్టే పోతుంది.శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేసి, మలినాలను తీసివేయడం లో ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితం వస్తుంది. చర్మ సమస్యలు అరికట్టడంలో ఇది బాగా పనిచేస్తుంది.
also read;
“పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా..?