Advertisement
బాహుబలి 2 : టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 5 ఏళ్ళు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా చూపించింది. ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసుకునేలా అన్నీ ఇండస్ట్రీలలో జెండా పాతేసింది బాహుబలి 2. 2015లో విడుదలైన మొదటి భాగమే 500 కోట్లు వసూలు చేసింది. అప్పుడే అంతా నోరెళ్లబెట్టారు. అలాంటిది రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా రెండు వేల కోట్లకు చేరిపోయింది.
Advertisement
ఇది ఇలా ఉండగా… బాహుబలి 2 పార్టు లో మనకు యుద్ధం సీన్ లో మహేంద్ర బాహుబలి బల్లాల దేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో తాటి చెట్లను చూపిస్తారు. మహేంద్ర బాహుబలి తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతో బల్లాల దేవుడి కోట మీదకు యుద్ధానికి వస్తాడు. అయితే కోట ప్రధాన ద్వారం మూసివేస్తారు. దీంతో కోటలోకి కచ్చితంగా వేరే మార్గంలో ప్రవేశించాల్సి వస్తుంది.
Advertisement
అప్పుడు తాటిచెట్ల సహాయంతో లోపలికి చేరుకుంటారు. ముగ్గురు, నలుగురు కలిసి జట్టుగా ఏర్పడి చుట్టూ రక్షణ కవచాలను పెట్టుకొని తాటి చెట్టును సాగదీసి విడిచిపెడతారు. దీంతో ఆ ఊపు, వేగానికి కోటలో ఎగురుకుంటూ వెళ్లి పడతారు. అయితే సినిమాలో తాటి చెట్లను సులభంగా వంగేలా చేయవచ్చు, అన్నట్లుగా చూపించారు. దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. కానీ వాస్తవానికి తాటి చెట్లు అలా వంగుతాయా? వాటిని వంచగలమా? ఇందుకు సైన్స్ ఏమని సమాధానం చెబుతోంది? అంటే తాటి చెట్లు వంగే గుణాన్ని కలిగి ఉంటాయి కరెక్టే. కానీ బాహుబలి సినిమాలో చూపించినంత రబ్బరులా వంగవు. కేవలం 50 డిగ్రీల కోణం వరకు మాత్రమే వంగగలవు. అంతకుమించి ప్రయత్నిస్తే అవి విరిగిపోతాయి. కనుక అలా చూపించడం సినిమాల వరకే. వాస్తవానికి అది సాధ్యపడదని చెప్పవచ్చు.
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!