Advertisement
ఎన్టీఆర్ ను పార్టీ నుంచి వెళ్లగొట్టిందే చంద్రబాబు అన్నారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే.. ఎన్టీఆర్ స్పందించాలి కదా.. ఎంత అయినా ఫ్యామిలీ కదా అని చాలా అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ని ఫ్యామిలీ సభ్యుడిగానే చూడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే.. ఎన్టీఆర్ కు ఏంటి సంబంధం ? ఆయన ఎందుకు స్పందించాలి ? ఎన్టీఆర్ స్పందించాలని అడిగే వాళ్లకు ఏం సంబంధం ? కుటుంబం కదా అని ఎన్టీఆర్ అనుకోవడం కాదు.. ఆయనను ఎప్పుడైనా వీరు కుటుంబంగా చూశారా..? కుటుంబంలోని సభ్యుడు అని అనుకున్నారా..? ఎలా కుటుంబం అవుతుంది.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ని తమ కుటుంబం అని.. నందమూరి, నారా ఫ్యామిలీలు అనుకోలేదు. మధ్యలో కొంతకాలం అనుకున్నారు. కానీ.. ఎన్టీఆర్ ఎప్పుడూ సెపరేట్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ కి స్టార్ డమ్ వచ్చిన తరువాత వీరందరూ వచ్చారు. నందమూరి తారకరామారావు అనే పేరుంది. కాబట్టి.. ఓన్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు పిలిచి ఎన్నికల ప్రచారం చేయమంటే.. వెళ్లి చేశారు. మధ్యలో ఆయనకు యాక్సిడెంట్ అయింది. ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. పార్టీ కోసం ప్రాణం పెట్టిన మనిషి జూనియర్ ఎన్టీఆర్ అలాంటి మనిషిని 2014లో వదిలిపెట్టేసి.. పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లారు. నేను ఇంట్లో కలవను ఆఫీస్ లో కలుస్తానని.. పవన్ కళ్యాణ్ అంటే.. అప్పుడు మళ్లీ ఆఫీస్ కి వెళ్లి కలిసి.. రెండు గంటలు వెయిట్ చేసి మరీ పవన్ కళ్యాణ్ ని కలిసి పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కి జూనియర్ ఎన్టీఆర్ ఈక్వల్ కేడర్. ఇద్దరి లేవల్ ఒకటే. అలాంటి ఇంటి మనిషి ఎన్టీఆర్ ని వదిలి పవన్ కళ్యాణ్ దగ్గరికీ వెళ్లినప్పుడు ఎన్టీఆర్ ఇంకెప్పుడూ వస్తాడు. ఎందుకు రావాలి.. వాళ్లు ఎన్టీఆర్ ని కాదని.. పవన్ కళ్యాణ్ దగ్గరికీ.. వెళ్లారటే.. ఎన్టీఆర్ ని వదులుకున్నట్టే కదా.. నువ్వు వద్దని డైరెక్ట్ గా చెప్పేసిన తరువాత ఆయన రాలేదు చేయలేదని అడిగే హక్కు టీడీపీ వాళ్లకి ఉందా ?
Advertisement
నువ్వు రావాల్సిన అవసరం లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారున్నారు. మేము చూసుకుంటామని చంద్రబాబు.. ఎన్టీఆర్ తో చెప్పేశారు. అలాంటి అప్పుడు ఎన్టీఆర్ ఎందుకొస్తారు. ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ప్రచారం చేయమని చెప్పాడు. ఎన్టీఆర్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లినప్పుడే నేను ఈ మాట చెప్పాను. ఇంట్లో ఎన్టీఆర్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ కోసం వెళ్లి వెయిట్ చేయాల్సిన కర్మ చంద్రబాబుకు ఏమి వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగ ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం వెళ్లి వెయిట్ చేయాల్సినంత కర్మ ఏమొచ్చింది. ఓట్లు అడుక్కునేంత కర్మ ఎందుకు? పవన్ కళ్యాణ్ కి సమాన స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ ని వదిలేసి ఈ కర్మ ఎందుకు..? తనకు కాదని.. పవన్ దగ్గరికి చంద్రబాబు వెళ్లారంటే.. చంద్రబాబా..? ఎన్టీఆరా..? మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఎన్టీఆర్ రాలేదని అంటారు అని తమ్మారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.