Advertisement
తమిళ ఇండస్ట్రీలో ” ముల్లుం మలరుమ్” అనే టీవీ సీరియల్ నటి శాలిని ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె సీరియల్ ద్వారా పొందిన గుర్తింపు కంటే ఇప్పుడు ఈ ఫోటోషూట్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది. భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఘనంగా విడాకుల ఫోటోషూట్ నిర్వహించింది. ఈ ఫోటోలని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు తాను ఉన్న నరకం నుంచి విడుదలైనందుకు సంతోషంగా ఫీల్ అవుతూ.. అతడితో కలిసి ఉన్న ఫోటోలను చింపుతో ఫోటోషూట్ చేసింది.
Advertisement
Read also: రెబెల్ స్టార్ ప్రభాస్ వలెనే మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించారట !
Advertisement
ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడంతో కొందరు శాలినికి సపోర్ట్ చేయగా.. మరికొందరు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఆమె అలా చేయడానికి వెనుక బలమైన కారణమే ఉందట. భర్తతో ఆమె అనుభవించిన నరకం గురించి శాలిని మాట్లాడుతూ.. ” నా ఫ్రెండ్స్ నీకేంటి దుబాయ్ లో ఉంటున్నావు అంటుంటారు. దుబాయ్ లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్ లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే అప్పటికి ఆ గొడవను అలా ఆపాలని చూసేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో నాకు తెలియదు. ఒక్కోసారి పోలీసుల దగ్గరికి వెళదాము అని అనిపించినా.. అతని జీవితం నాశనం అవుతుందని నేను సర్దుకుపోయేదాన్ని.
2019 వరకు నాలుగేళ్ల దాకా అతడితో దెబ్బలు తిన్నాను. అన్ని సంవత్సరాలు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగి ఇవ్వాలని అనిపించింది. దీంతో తిరగబడ్డాను. కానీ పాప కోసం ఆలోచించి అతడికి మర్యాద ఇచ్చాను. ఎప్పుడైతే నా పిల్లలు ఏడుస్తున్నా కూడా వారి ముందే నన్ను కొట్టాడో.. ఇకపై ఇలాంటి తండ్రి వాళ్లకు అవసరం లేదు.. ఇక వదిలేయాలనుకున్నాను. అలా విడాకులకు అప్లై చేసి తీసుకున్నాను” అంటూ ఆమె భరించిన వేదన గురించి చెప్పుకొచ్చింది.
https://twitter.com/VidyaV007/status/1653358412300955649?s=20
Read also: మైత్రి మూవీస్, సుకుమార్ ల పై ఒకేసారి ఎందుకు ఐటీ రైడ్స్ జరిగాయి?