Advertisement
సాధారణంగా భారతదేశం వివిధ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం. ముఖ్యంగా దేశంలో విభిన్న మతాల వారు, విభిన్న ఆచారాలు, రకరకాల పద్దతులను పాటిస్తుంటారు. ముఖ్యంగా ఎవరి ఆచారం ప్రకారం వారు నడుచుకుంటారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏపని చేయాలన్నా ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తుంటారు. ఈ సాంప్రదాయాలను పూర్వకాలం నుంచి పెద్దలు పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. అటువంటి సాంప్రదాయాల్లో చావు తంతు కూడా ఒకటి. చనిపోయిన వ్యక్తిని ఊరేగింపుగా తీసుకెళ్లి చితిపై పడుకోబెట్టిన తరువాత తలకొరివి పెట్టి ఆ చితికి నిప్పు అంటిస్తారు. నిప్పు అంటించిన తరువాత అసలు వెనక్కి చూడకూడదు అని అంటుంటారు. అసలు అలా ఎందుకు చేస్తారో అప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ప్రధానంగా అంత్యక్రియలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తుంటారు. వారి వారి ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తేనే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దవారు పేర్కొంటుంటారు. చనిపోయిన వ్యక్తిని చితిపై పడుకోబెట్టి.. తలకొరివి పెట్టే వ్యక్తి కుండతో చితి చుట్టు తిరిగిన తరువాత చితికి నిప్పు అంటించి ముందుకు వెళ్తారు. మళ్లీ వెనక్కి మాత్రం చూడరు. ఎందుకంటే..?
Advertisement
గరుణ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి అంత్యక్రియల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి చూడకూడదట. అలా చూసినట్టయితే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ చూసే వారితో ప్రేమలో పడుతుందట. తన నిష్క్రమణ కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని భావిస్తుందట. అందువల్ల ఆత్మ శాంతిని పొందదు. అలా చూసిన వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది. ఆ వ్యక్తి ఇంటికి రావాలని కోరుకుంటుందట. అందుకే అంత్యక్రియల తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు అని మన పెద్దలు, పండితులు పేర్కొంటుంటారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
మీరు స్నేహితురాలికి చెప్పకూడని టాప్ 10 విషయాలు ఇవే..!
పెళ్లై ఇద్దరూ పిల్లలు.. ఈ మహిళ ఇలా చేస్తుందని అస్సలు ఊహించి ఉండరు..!