Advertisement
‘అన్ స్టాపబుల్’ షో ఇప్పుడు ట్రెడింగ్ లో ఉన్న షో. బాలయ్య హోస్ట్ గా తొలిసారి చేసిన షో ‘అన్ స్టాపబుల్’. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో.. ‘అన్ స్టాపబుల్-2’ ను కూడా తీసుకువచ్చింది ఆహాం. అయితే.. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ‘అన్ స్టాపబుల్-2’ మొదలైంది. తొలి ఎపిసోడ్ 14వ తేదీన స్ట్రీమ్ అయి, ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదంతా ఓకే ఇక్కడే సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. తొలి సీజన్ లాగే రెండో సీజన్ కూడా మచ్చలు చెరిపేసే కార్యక్రమమేనా అని అంటున్నారు.
Advertisement
read also : ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు !
అదేంటి మచ్చలు చెరిపేయడం అనుకుంటున్నారా? ‘ఆన్ స్టాపబుల్’ తొలి సీజన్ చూస్తే అందులో చాలా వరకు కొత్త బాలకృష్ణను చూశాం. కోపంగా ఉంటారు. అగ్రెసివ్ గా ఉంటారు. అని బాలయ్య మీద ఉన్న చెడ్డ పేరును చెరిపేసింది ఆ కార్యక్రమం. అయితే పనిలో పనిగా బాలకృష్ణ చేసే సేవా కార్యక్రమాలు గురించి చెప్పుకొచ్చారు. కుర్ర హీరోలను పిలుచుకొచ్చి మీరు ఎందుకు స్టార్ అయ్యారు అంటూ కొన్ని మాటలు వినిపించారు. అవి వారి మనసుల్లోంచి వచ్చి ఉంటే, గతంలో చాలా సందర్భాల్లో బయట స్టేజీల మీద వచ్చేవి కదా అనేది అభిమానుల ప్రశ్న.
Advertisement
వీటితోపాటు మరో పని కూడా జరిగిపోయింది. ఇండస్ట్రీలో బాలయ్యతో వైరం ఉంది అంటూ వినిపించిన, కనిపించిన హీరోలను షోకి పిలిచి మా మధ్య ఏమీ లేదు అని చెప్పకనే చెప్పించారు. అయితే ఈ సీజన్ లో బాలయ్య సహోదయా నటులు ఎవరూ రాలేదు. అంతా బాలయ్య తర్వాతి తరం వారే. దీంతో అప్పుడు జరిగినవి బయటకు రాలేదు. అలాగే టిడిపి నుండి ఎన్టీఆర్ ను దూరం పెట్టిన విషయంలో కూడా ‘అది తప్పనిసరి నిర్ణయం’ అనేట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలయ్య సొంత సినిమా ప్రమోషన్లు, అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్లు, కూడా అయిపోయాయి. ఇవి అందరూ చూసినవే. ఇక కొత్త సీజన్ లో ఏమంటుందా అంటే తొలి ఎపిసోడ్ నుండే మచ్చలు మాయం కాన్సెప్ట్ మొదలైంది. ‘బిగ్ డెసిషన్ 1995’ అంటూ చంద్రబాబు నాయుడుతో అప్పటి విషయంపై క్లారిటీ ఇప్పించారు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవడం, స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలు లాంటి వాటిపై క్లారిటీ ఇచ్చేలా ఎపిసోడ్ డిజైన్ చేశారు అంటూ జోకులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
READ ALSO : మన అభిమాన హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా?