Advertisement
ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం ముత్తాతల కాలం నుండే ఉంది. ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని, ఒకవేళ కాకి ముట్టకపోయినట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తీర్చనందువల్ల వారు అసంతృప్తికి గురయ్యారని అనుకుంటారు. అలాగే కాకి మన ఇంటి పరిసరాలలో అరిస్తే ఇంటికి బంధువులు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణలో ఉంది.
Advertisement
Read also: అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?
కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి లేదా చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని చెబుతారు. అయితే కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం? కాకులను ఎప్పుడు చూడడం మంచిది? దీని గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎటైనా బయటికి వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే వారు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కుండపై వాలిఉన్న కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలో ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకొని దాన్ని మనిషి పై పడేస్తే అది అశుభానికి సంకేతం. ఇక మాంసం ముక్కను పట్టుకువెళ్తూ కింద ఏ వ్యక్తి పైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వాసం.
Advertisement
అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాగితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒకచోట సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ, ఆ చుట్టు ప్రక్కల ఉన్నవారు సమస్యల్లో పడుతారు. ఇంటి పై కప్పు పై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతుందని అంటున్నారు. ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకుల అరుపులు వినడం శుభప్రదం అని చెబుతారు. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు. పితృపక్షంలో కాకిని చూడడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
Read also: మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?