Advertisement
హైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ రేసు ముగిసింది. ఈ మెయిన్ రేసులో జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. న్యూజిలాండ్ కు చెందిన నిక్ క్యాసిడీ(ఎన్విజన్ రేసింగ్ టీమ్) రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ రేసర్ సెబాస్టియన్ బ్యూమీ(ఎన్విజన్ రేసింగ్ టీమ్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసల జల్లు కురిపించారు ప్రముఖులు.
Advertisement
ఈ రేసింగ్ ను చూసేందుకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, ధావన్, రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, యశ్, మహేష్ బాబు కుమారుడు సహా పలువురు పాల్గొని సందడి చేశారు. వీళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రేసింగ్ చూడడానికి ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
హైదరాబాద్ తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం అని అన్నారు అమర్నాథ్. అలాంటి నగరానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని కొనియాడారు. విశాఖను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఫార్ములా రేసు నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి రేసులు ఎప్పుడు నిర్వహిస్తారన్న ఓ ప్రశ్నకు మంత్రి విచిత్రమైన సమాధానమిచ్చారు. ‘‘కోడి గుడ్డు పెట్టగలదు. కానీ, కోడి.. కోడిని పెట్టలేదుగా?.. కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుంది. ఏపీ కూడా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించే స్థాయికి చేరుతుంది’’ అని చెప్పారు మంత్రి అమర్నాథ్.