Advertisement
పెళ్లి విషయంలో ఆ తల్లిదండ్రులు చేసిన పొరపాటు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని దూరం చేసింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోను అని ఎంత చెప్పినప్పటికీ తల్లిదండ్రులు వినకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్న కూతురు కావడంతో గారాబంగా పెంచిన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, కొండేరు గ్రామంలో కోటమ్మ – హనుమంతు అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె పేరు రాణి.
Advertisement
Read also: పెళ్లికి సిద్ధమైన యాంకర్ ప్రదీప్… అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement
చిన్న కుమార్తె అయినందున తల్లిదండ్రులు గారాబంగా పెంచి పెద్ద చేశారు. అడిగిందల్లా కొని పెడుతూ ఉన్నత చదువులు చదివించారు. ఇక చదువు పూర్తి చేసుకుని పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల అనేక చోట్ల పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ రాణికి మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయాన్ని రాణి పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళింది. కానీ తల్లిదండ్రులు మాత్రం కూతురి మాట వినలేదు. ఇక చేసేదేమీ లేక బుధవారం తల్లిదండ్రులు పనులకు వెళ్ళగానే యువతి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది.
పనులు ముగించుకొని కోటమ్మ, హనుమంతు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో కూతురు కనిపించలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఎవరికి ఫోన్ చేసినా మా ఇంటికి రాలేదనే సమాధానమే వచ్చింది. దీంతో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు తోచక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిక్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలా కూతురు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read also: ‘కాంతార’ సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?