Advertisement
బుల్లితెర కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అమాయకుడిగా కనిపిస్తూ కడుపు ఉబ్బా నవ్వించడంలో యాదమ్మ రాజు దిట్ట. ప్రస్తుతం జబర్దస్త్ షో లో సద్దాం టీమ్ లో చేస్తున్నాడు యాదమ్మ రాజు. అతని భార్య స్టెల్లా అందరికీ సుపరిచతమే. ఒక టీవీ ప్రోగ్రామ్ లో తన భార్యను తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం బయటపడింది. గత ఏడాది వీరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం యాదమ్మరాజు-స్టెల్లా విడాకులకు సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Advertisement
వీరి పెళ్లి జరిగి ఏడాది కూడా తిరగకుండానే అప్పుడే వికులు ఏంటి.. అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో కడుపుబ్బా నవ్వించే యాదమ్మ రాజు, అతని భార్య స్టెల్లా గత ఏడాది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్టెల్లా భర్త పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చేసింది. పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఓ డ్యాన్స్ షోకి హాజరైన ఈ జంట తాము విడాకులు తీసుకోబోతున్నట్టు తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఇది వాస్తవం కాదట.. ఉత్తుత్తిగానేనట. ఇంతకు విషయం ఏంటంటే..?
Advertisement
బుల్లితెర కామెడీ షో ప్రతీ వారం ఓ వెరైటీ థీమ్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు కమెడీయన్లు. దీనిలో భాగంగా భాగంగా ఈవారం యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు ఓ స్కిట్ వేస్తున్నారు. విడాకుల థీమ్ తో ఈ జంట కనిపించనున్నారు. “ నీతో నా వల్ల కావడం లేదు. నాకు విడాకులు కావాలి” అని స్టెల్లా అడుగుతుంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్ లా జరగాలని చెబుతుంది. తాజాగా విడుదలైన కామెడీ షో ప్రోమోలో ఈ మేరకు కనిపించారు. దీంతో ఇదంతా ప్రమోషన్ స్టంట్ అని తెలిసి ప్రేక్షకులు కన్నెర్ర చేస్తున్నారు. ఇదేం పైత్యం.. కొత్తగా జంట విడాకులు తీసుకోవడం ఏంటి.. అంతకు మించి వేరే ఆలోచనలే ఏం లేవా..? అంటూ విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం కలపడం, విడదీయడం వీళ్లకు కొత్తదేం కాదులే అంటూ మండిపడుతున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
యాంకర్స్ నుండి హీరోయిన్స్ అయిన 3 సెలెబ్రెటీస్ వీరే..!
SPY MOVIE REVIEW: నిఖిల్ ”స్పై” సినిమా హిట్టా..? ఫట్టా..?
పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్ ని చూసి.. ”అమితాబ్” ఏం చేసారో తెలుసా..?