Advertisement
ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ షో వస్తుంది అంటే పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు కూర్చునే వారు అనేకం. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ కామెడీ షో కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో కమెడియన్స్ వేసే కామెడీ పంచులు, స్కిట్స్ ద్వారా కడుపుబ్బ నవ్వించి మంచి గుర్తింపు సాధించారు. ఈ షో ఎంతోమంది కమెడియన్ కి జీవితం ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్, రాకెట్ రాఘవ, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను, చలాకి చంటి,షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలు గా మారారు..
Advertisement
ఇప్పటికే ఇంతమంది పాపులర్ నటులుగా మారడంతో పాటు ఈ షోలో లేడీ గెటప్ లు వేసే వారు కూడా ప్రత్యేకం. స్కిట్స్ సమయంలో లేడీ గెటప్ ల కోసం ఎక్కువమంది మగవారే ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్.. అలాంటి శాంతి స్వరూప్ స్వగ్రామం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్తూరు గ్రామం.. ఆయన తండ్రి పేరు రాఘవయ్య.. వీరిది వ్యవసాయ కుటుంబమే. చదువు పూర్తికాగానే టిడిపిలో నెలకు ₹1000 జీతానికి పని చేశాడు శాంతి స్వరూప్. కానీ ఆయనకు చిత్ర పరిశ్రమ లోకి రావాలనే కోరిక బలంగా ఉండేది. దీని కోసమే హైదరాబాద్ వచ్చారు. మొదట్లో జబర్దస్త్ షోలో ఆఫీస్ బాయ్గా చేరాడు. రచ్చ రవి, రాకెట్ రాఘవ తో పరిచయం పెంచుకొని చివరకు చమ్మక్ చంద్ర ద్వారా ఈ షోలోకి ప్రవేశించాడు.
Advertisement
ముందుగా యాంకర్ సుమ ఇతని శాంతి అనే పేరును శాంతి స్వరూప్ గా మార్చిందట.. ఈ విధంగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సందర్భంలోనే హైపర్ ఆది టీం లీడర్ కావడం, ఆ టీంలో లేడీ గెటప్ లు వేయడానికి అవకాశం ఇవ్వడంతో శాంతి స్వరూప్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.. దీంతో లేడీ కమెడియన్ గా సెట్ అయిపోయారు.ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయట. నితిన్ నటించిన లై,మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు, ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఇంకా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో అవకాశం వచ్చింది.
also read: