Advertisement
ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికీ ఈ షో వస్తుంది అంటే పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు కూర్చునే వారు అనేకం. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ కామెడీ షో కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో కమెడియన్స్ వేసే కామెడీ పంచులు, స్కిట్స్ ద్వారా కడుపుబ్బ నవ్వించి మంచి గుర్తింపు సాధించారు. ఈ షో ఎంతోమంది కమెడియన్ కి జీవితం ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ చేసిన చాలామంది సినిమాల్లో బిజీగా రాణిస్తున్నారు.
Advertisement
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?
మరోపక్క బుల్లితెరపై కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఇందులో యాదమ రాజు కూడా ఒకరు. పటాస్ షో ద్వారా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఓ స్టూడెంట్ గా ఈ షోలో అడుగుపెట్టి, ఇతను వేసిన జోకులు బాగా పేలడంతో, వెంటనే పార్టిసిపెంట్ గా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుస షోలు దక్కించుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా చాలా రోజులుగా ఇతను స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతోంది.
Advertisement
అయితే కొంతమంది దురదగాళ్లు నిశ్చితార్థం చూసి తెగ బరికేసుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. కానీ మధ్యలో ఈ దురదగాళ్లు మాత్రం వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి తేగ కుళ్ళుకుపోతు రెచ్చిపోతున్నారు. ఇంతకీ వాళ్ళు చేసిన మహా పాపము ఏంటంటే, ఆ నిశ్చితార్థం ఫోటోలలో పెళ్లికూతురు స్టెల్లాకి నుదుటిపై బొట్టు లేదట. అంతేకాదు, యాదమ రాజు హిందువు. స్టెల్లా క్రిస్టియన్ కావడంతో, వీళ్ళేదో ఆ యాదమ రాజు బొడ్డు కోసి పెంచినట్టుగా, ‘ఏరా రాజుగా, మొత్తానికి తల్లిదండ్రుల పుట్టు పూర్వత్తరాలు వారి సాంప్రదాయాలు అన్ని గాలికి వదిలేసి కేవలం ఒక ఆడదాని కోసం మతం మారినవ్, ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా సిగ్గు లేదు నీకు’ అంటూ తిట్టడం మొదలుపెట్టారు కొంతమంది మత పిచ్చోళ్ళు.
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?