Advertisement
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చూస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక పాలసీ పై రచ్చ కొనసాగుతోంది. ఉచిత ఇసుక గురించి అనేక కొత్త అంశాలని తీసుకువస్తున్నారు. కొత్త ఇసుక రీచ్ల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక అమలు పైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి పలు ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చూసారు. సీఎం చంద్రబాబుని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి అబద్దాలు చెప్పారు.
Advertisement
ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నది ఏంటి అని అడిగారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తోందా అని నిలదీశారు. ఒకవేళ లభిస్తే ఎక్కడో చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులు వచ్చేవి ఇప్పుడు అది కూడా లేదని చెప్పారు. అసలు ఇసుక కొందామంటేనే తమ హయాం కంటే ప్రస్తుత రేటు రెండింతలు ఉందని వివరించారు.
Advertisement
Also read:
ఉచితంగా ఇసుక ఇస్తామని ఊరూరా డప్పు వేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. ప్రజలని మోసం చేయడం కాదా అని అడిగారు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫీయాని మీరు ఏర్పాటు చేయలేదా అని జగన్ అడిగారు. భరించలేని రేట్లతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారా లేదా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం స్టాక్ ఆర్డర్లో ఉంచిన 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!