Advertisement
YCP రాజీనామాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికి రాజీనామా చేసేసారు కొందరితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాము జగన్ తో కొనసాగుతామని అన్నారు. పార్టీని విడిచి పెడుతున్న సమయంలో జగన్ అప్రమత్తమయ్యారు. కీలక నేతలతో మంతనాలు జరిపారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాల పైన పార్టీ ముఖ్యనేతలతో జగన్ మాట్లాడారు. మరో ముగ్గురు ఎంపీల సైతం అదే బాటలో ఉన్నట్లు సమాచారం.
Advertisement
దీనిపై ఆరా తీశారు. జగన్ తో చర్చల తర్వాత తమ పార్టీ వీడడం లేదని పిల్లి రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య చెప్పారు. పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పదవులు టీడీపీకి వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పార్టీ వీడాలని ఆలోచనతో ఉన్నవారితో మాట్లాడాలని ఇద్దరు ముఖ్య నేతలకు జగన్ సూచించారు. వారికి తగిన ప్రాధాన్యతను ఇచ్చామని ఓటమితో అంతా అయిపోలేదని అన్నారు.
Advertisement
Also read:
తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పార్టీ నేతల నుంచి సమాచారం. మోపిదేవి నిర్ణయం పైన జగన్ మనస్థాపానికి గురైనట్లు చెప్తున్నారు. జగన్ తో చర్చలు తర్వాత బోస్ మీడియ ముందుకు వచ్చారు. జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలు ఉన్న వైసీపీని వేయడం లేదని రాజ్యసభకు రాజీనామా చేయట్లేదని అయోధ్య రామిరెడ్డి అన్నారు. గొల్ల బాబురావు రఘునాథరెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్ళరని చెప్పారు. తాము తనతోనే ఉంటారని జగన్ చెప్పినట్లు బోస్ వెల్లడించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!