Advertisement
ఏపీలోని రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ లక్ష్యంగా పెట్టుకొని కూటమి వ్యూహాత్మకంగా నడుస్తోంది రాజకీయంగా జగన్ ని దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మండిపడి కేసులు పెట్టింది. అలాగే అదే స్థాయిలో అరెస్టులు ప్రారంభం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది భూ లావాదేవీల పై ఫోకస్ చేస్తోంది. ఆధారాలను సేకరించే పనిలో పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని టీడీపీ తో పాటుగా జనసేన కూడా ఆరోపణలు చేస్తోంది.
Advertisement
జగన్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా భూ ఆక్రమణలు జరిగినట్లు కూటమినేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. 25 ఎకరాల అసైన్డ్ భూములను గత ప్రభుత్వ హయాంలో చేతులు మారాయని చెప్పుకొచ్చారు. అలాగే కూటమి వచ్చాక అన్ని జిల్లాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన మొదలైంది.
Advertisement
Also read:
భూతగాదాలను బయట పెట్టడానికి చూస్తోంది. ల్యాండ్ క్రాపింగ్ యాక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. జగన్ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఐడి విచారణ కూడా కొనసాగింది. మాజీ మంత్రులపై కేసులు నమోదు చేశారు. కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కలిగింది. భూదందా నడిపిన నేతల్లో రకమైన ఆందోళన మొదలైంది ఏమవుతుందనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!