Advertisement
కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే మొదలుపెట్టారు. తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెసిఆర్ చేసిన పొరపాటు తను చేయకూడదని జగన్ అనుకుంటున్నారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడానికి జగన్ చూస్తున్నారు. తెలంగాణలో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాలేదని ఆ విషయం సర్వే ద్వారా కేసీఆర్ కి తెలిసింది.
Advertisement
కానీ అందుకు ఆయన సిద్ధపడలేదని అతివిశ్వాసం కారణంగా ఓటమి తప్పలేదని అంతా అన్నారు. సిట్టింగ్లని పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చి ఉంటే బిఆర్ఎఫ్ గెలిచి ఉండేదని తెలుస్తోంది. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పొచ్చు కొన్నిచోట సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చక తప్పదని వైసిపి నేత సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ టికెట్ ని గంజి చిరంజీవికి ఇవ్వాలని అనుకుంటున్నారు.
Advertisement
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ నిరాకరిస్తున్నారు అలానే గాజువాకలో నియోజకవర్గం ఇన్చార్జిని మార్చారు. దీనిని బట్టి ఎమ్మెల్యే నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 11 నియోజకవర్గాల ఇన్చార్జీలని వైసిపి నాయకత్వం మార్చింది. అలానే మరికొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలని కూడా మార్చడానికి కసరత్తు చేస్తోంది. దాదాపు 65 స్థానాల్లో అభ్యర్థులని మార్చాలని వైసీపీ భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది. అభ్యర్థులు మార్పు ఎలాంటి పరిణామాలుకి దారితీస్తుంది అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!