Advertisement
తాజాగా తిరుమల లడ్డు గురించి చర్చ జరుగుతోంది. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ లడ్డు కల్తీ వ్యవహారం గురించి జగన్ పాలన పై నిందించడంతో వైయస్ జగన్ సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చాడు. మన దేశంలో అత్యంత ధనిక దేవాలయాల్లో తిరుమల ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళుతూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో దర్శనంతో పాటు ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించి అందరూ స్వీకరిస్తారు.
Advertisement
అయితే దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కల్తీలు జరిగాయని. ప్రసాదం ను అపవిత్రం చేశారని జంతువుల కొవ్వు ఉపయోగించి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా దేవాలయాలను శుద్ధి చేస్తున్నారు.
Advertisement
Also read:
అయితే వైసిపి ప్రభుత్వం ఏ విధమైన తప్పు చేయలేదంటూ, దేవాలయాలను అస్త్రంగా ఉపయోగించుకుంటుంది. వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్ కూడా దేవాలయాల్లో పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యక్ష పూజలు నిర్వహించాలని వైసీపీని పిలుపునిచ్చింది. ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను తీస్తున్నారని ఎలాంటి కల్తీ జరగలేదని ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయించాలని జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. దాంతో కూటమి ప్రభుత్వం పై ఈ మాస్టర్ ప్లాన్ ను వైసిపి ప్రభుత్వం వేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!