Advertisement
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకొక నిర్ణయాన్ని తీసుకుంది. వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకానికి పేరును మార్చేసింది. దానికి ఎన్టీఆర్ పేరుని పెట్టింది. జగన్ హయాంలో అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల పేర్లను చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ మార్చారు. ఈ జాబితాలో దాదాపు అన్ని నవరత్న పథకాలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ పేర్లు ఎక్కడ కనిపించకుండా ప్రభుత్వం చూసుకుంది.
Advertisement
Advertisement
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న విదేశీ విద్యా దీవెన- అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేర్లను మార్చింది. అలాగే వైఎస్ఆర్ కల్యాణమస్తును చంద్రన్న పెళ్లికానుక, వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మార్చారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంను ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, వైఎస్ఆర్ పెంఛన్ కానుకను ఎన్టీఆర్ పెంఛన్ కానుక అని మార్చారు.
Also read:
జగన్ అన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ గా నామకరణం చేశారు. ఈ మేరకు మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అర్హులైన 30.75 లక్షల మందికి సొంత ఇంటిని సమకూర్చాలని ఉద్దేశంతో జగన్ అమలు చేసిన పథకం ఇది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!