Advertisement
ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి సమీక్షలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తుపై పార్టీ నేతలకు భరోసానిస్తున్నారు. వరుసగా పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ దాడులు జరిగినా పార్టీ శ్రేణుల పరామర్శకు సిద్ధమయ్యారు. కష్టాలు కొత్త కాదని అన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశానని వయసు, సత్తా ఇంకా ఉందని చెప్పారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఎలా వ్యవహరించాలని జగన్ ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. పార్టీ ఎంపికలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం అవుతున్నారు.
Advertisement
ఓటమి తర్వాత ఆ పలు జిల్లాలకు చెందిన నేతలు జగన్ తో భేటీ అయ్యారు ఫలితాలపై సమీక్ష చేశారు అన్నారు. కానీ ఫలితం మాత్రం అర్థం కాలేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం కష్టాలు కొత్త కాదని ఆయన అన్నారు. ఐదేళ్లు ఓపిక పడితే మరోసారి పార్టీ ఎగిసిన కెరటంలా దూసుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు. టీడీపీ కూటమికి శాసనమండలిలో సంఖ్యాపరంగా బలం లేదు. దీంతో ఎమ్మెల్సీతో సమావేశ సమయంలో జగన్ ఇదే విషయం మీద అప్రమత్తం చేశారు అని ప్రలోభాలకు గురి చేస్తారని అలెర్ట్ చేసారు.
Advertisement
Also read;
Also read:
కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణలు నెంబర్ గేమ్ వేళ ఎంపీలతో జగన్ సమావేశం అవుతున్నారు. 2014 -19 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలోనూ బిజెపి ఉంది నెంబర్ గేమ్ కీలకంగా మారడంతో జగన్ అప్రమత్తమయ్యారు. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేదు లోక్ సభలో వైసిపికి నలుగురు మాత్రమే ఉన్నారు. ఏపీలో బలం లేకపోయినా కేంద్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!