Advertisement
లద్ధాఖ్‌లో జరిగిన ప్రమాదంలో అమరులైన ముగ్గురు జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. జవాన్లు వీర మరణం చెందడం తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయలు సహాయం అందించి ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ పోస్ట్ చేశారు. మరోవైపు లద్ధాఖ్ వద్ద నదిని దాటే ప్రయత్నంలో జవాన్లు అమరులయ్యారు.
Advertisement
వీరిలో ఏపీకి చెందిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఈ ప్రమాదంలో కృష్ణ జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు. అలానే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి. అలాగే బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కి చెందిన సుభాన్ ఖాన్లు అమరులయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలవాలని జగన్ అన్నారు. అలాగే ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు వీరి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
Advertisement
Also read:
Also read:
అమరులైన జవాన్ల భౌతికకాయలు ఏపీకి చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. చనిపోయిన వాళ్ళల్లో ముత్తుముల రామకృష్ణారెడ్డి జూనియర్ కమిషనర్ అధికారిగా వ్యవహరిస్తూ చనిపోయారు. పెడనకు చెందిన సాధారణ నాగరాజు సైనికుడిగా సేవలు అందిస్తూ ప్రాణం విడిచారు. నాగరాజుకి ఐదేళ్ల కిందట పెళ్లయింది ఏడాది వయసున్న పాప ఉంది. నాగరాజు మృతితో కుటుంబం గుండె పగిలేలా రోదిస్తోంది. సుభాన్ ఖాన్ కూడా వీరమరణం పొందారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!