• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Jai Chiranjeeva Child Artist: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

Jai Chiranjeeva Child Artist: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

Published on March 20, 2023 by anji

Advertisement

ఏమీ తెలియని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికీ మన ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలా తెలుగు వాళ్ళ మనసుని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో శ్రియా శర్మ ఒకరు. అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు పెరిగి పెద్దయి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనేలా తయారైంది. ఈమెకు సోషల్ మీడియాలోనూ నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం.

Advertisement

Read also: MM కీరవాణి – SS రాజమౌళి ల ఆర్థిక పరిస్థితి ఒకప్పుడు ఇలా ఉండేదా ?

అయితే శ్రియాశర్మ అంటే ఎవరో మీరు గుర్తు పట్టకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “జై చిరంజీవ” చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో కనిపించింది ఈ క్యూట్ పాప శ్రీయ శర్మ. ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు, అలాగే రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ, నాని హీరోగా వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు వంటీ సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత తమిళ్, కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది శ్రియా. ఇక 2014వ సంవత్సరంలో గాయకుడు చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది. ఆ చిత్రంలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అయిన అలీ రెజా హీరోగా నటించాడు. ఆ సినిమా సమయానికి శ్రియ శర్మ వయసు 16 సంవత్సరాలు.

Advertisement

jai chiranjeeva kid latest pgotos jai chiranjeeva kid latest photos

 

ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన “నిర్మలా కాన్వెంట్” సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. శ్రియ శర్మది ఉత్తర ప్రదేశ్. ఈమె తండ్రి ఇంజనీర్, తల్లి డైటీషియన్. పుట్టిన నాలుగేళ్లకే యాక్టర్ గా మారిన శ్రీయ.. తన కెరీర్ లో ఓసారి నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. యాక్టర్ కం మోడల్ గా ఎంతో మందికి తెలిసిన శ్రియ శర్మ.. న్యాయవాద విద్య పూర్తి చేసి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కూడా ఆ ఈమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వయసు 24 సంవత్సరాలు. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్లను మించి గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక లాయర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గా చేస్తుందా? లేదా పూర్తిగా యాక్టింగ్ నీ పక్కన పెట్టేసిందా? అనేది తెలియాల్సి ఉంది.

Read also: నవీన్ కేసులో గర్ల్ ఫ్రెండ్ నిహారిక చెప్పిన సంచలన విషయాలు కొత్తగా వెలుగులోకి…!

Related posts:

‘ది లెజెండ్’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?  సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..? శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో ఈ ట్విస్ట్ గమనించలేదు గా సామి ! ఈ ట్విస్ట్ ఏంటి ? క్లారిటీ ఇచ్చేసారు ! పూరి జగన్నాధ్ పెళ్లి కి సహాయపడ్డ స్టార్ యాంకర్ ఎవరు ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd