Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం ముందు నుంచే ఓవైపు మంత్రులు, మరోవైపు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాటల యుద్ధమే చేస్తున్నారు. పవన్ కూడా వారికి కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ అమ్మఒడి నాలుగో విడుత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు.
Advertisement
ముఖ్యంగా దత్త పుత్రుడు.. ఫ్యాకేజీ స్టార్ మామూలుగా మాట్లాడడని.. ఆ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తాను అంటాడు. ఇష్టానుసారంగా ఊగిపోతూ మాట్లాడుతాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు, నిలకడ లేదు. దత్త పుత్రుడి మాదిరిగా తొడలు కొట్టలేం, పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ తిట్టలేం అంటూ విమర్శలు చేశారు జగన్. సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ భీమవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో కౌంటర్లు వేశారు.
Advertisement
సీఎంకి తెలుగు రాదు.. వారాహి అనే పదం పలకడం కూడా రాదు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత దగ్గర ఉండి నేర్పిస్తాను అని కౌంటర్లు వేశారు పవన్ కళ్యాణ్. కార్యకర్తల సమావేశంలో ఎక్కువ మాట్లాడాలని ఉంది. కానీ 30వ తేదీ సభలో వివరిస్తానని చెప్పారు. నేను ఊగిపోతూ మాట్లాడుతున్నానని.. సీఎం బాధపడిపోతున్నారు. ఈ సారి నుంచి ఆయన పద్దతిలోనే మాట్లాడుదామంటూ వ్యంగ్యంగా ఆయన తరహాలో చేతులు చూపిస్తూ హావభావాలు జగన్ మాదిరిగా పవన్ కొన్ని డైలాగ్ లు చెప్పారు. అమ్మ ఒడి పథకంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ సీఎం జగన్ నిలదీశారు పవన్. తాను చెప్పు తీసి చూపించడం వెనుక పెద్ద కథ జరిగిందని.. ఈ తరహాలో నాలుగో విడుత అమ్మఒడి బహిరంగ సభలో జగన్ తనపై చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ కౌంటర్లు వేసారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎనిమిదేళ్లు అక్కడే ఉన్నాం.. రాకేష్ మాస్టర్ పెద్ద కర్మలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్..!
సుస్మిత హీరోయిన్ గా రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది..? చిరంజీవే కారణమా..?
తల్లి పాత్రలు చేసే ఈ హీరోయిన్లు.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా..?