Advertisement
ఈసారి ఏపీలో జనసేన పోటీ ఆసక్తి రేపుతోంది. తాజా సర్వే ప్రకారం జనసేన పోటీ చేసే స్థానాల్లో చాలా దాకా పుంజుకుంటుంది. గత ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ ప్రభావం పెద్దగా ఎక్కడా కనపడలేదు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల గాజువాక, భీమవరం నుండి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల కూడా ఓడిపోయారు. ఒకచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు. భీమవరం లో కనీసం రెండో ప్లేస్ లో అయినా ఉన్న పవన్ గాజువాకలో మూడో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు.
Advertisement
గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం, గాజువాక వదిలిపెట్టి ఈసారి కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుండి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. జనసేన పొత్తు లో భాగంగా 21 అసెంబ్లీ సీట్లతో పాటుగా కాకినాడ బందరు ఎంపీ సీట్లకి కూడా జనసేన పోటీ పడుతుంది. కాకినాడ, బందరు రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు. రెండు ఎంపీ సీట్ల విషయంలో జనసేన గెలుస్తుందని అంటున్నారు. 21 ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేస్తే ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, పిఠాపురం, పి గన్నవరం, రాజోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, అవనిగడ్డ, ఉంగటూరు సీట్లలో గ్యారెంటీగా విజయాన్ని సాధించబోతోంది.
Advertisement
Also read:
Also read:
పోలవరం, రైల్వేకోడూరు, విశాఖ దక్షిణం, పాలకొండ సీట్లు గెలవడం కష్టం గా కనపడుతోంది. తిరుపతి, తెనాలి, రాజనగరం, కాకినాడ రూరల్ వంటి చోట్ల గట్టి పోటీ కచ్చితంగా ఉంటుంది. తిరుపతిలో జనసేన నుండి పోటీ చేస్తున్న వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అరుణ శ్రీనివాసులతో పాటుగా తెనాలి లో పోటీ చేస్తున్న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గట్టి పోటీగా ఎదుర్కొంటున్నారు. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న లోకం మాధవి కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు మరి గెలుపు ఎవరిది అనేది చూడాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!