Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లో జీవిత రాజశేఖర్ కూడా ఒకరు. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవిత రాజశేఖర్ మధ్య అన్యోన్యత గురించి అంతా చెప్తూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరోయిన్ జీవిత లవ్ స్టోరీని బయటపెట్టింది. లవ్ స్టోరీ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. జీవిత రాజశేఖర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్రతి విషయంలో స్ట్రాంగ్ గా ఉంటానని అందుకే బంధాన్ని ఎప్పుడు దూరం చేసుకోలేదు అని అన్నారు.
Advertisement
ఈ విషయం రాజశేఖర్ కి కూడా నచ్చుతుందని చెప్పారు. అమ్మాయిలు, ఫ్యాన్స్ ఎంతో మంది ఆయన చుట్టూ తిరుగుతుంటారు. ఆయనకు కాల్ చేసి మాట్లాడుతారు. కానీ నేను ఏ రోజు కూడా ఇన్ సెక్యూర్ గా ఫీల్ కాలేదు. రాజశేఖర్ అప్పుడు ఇప్పుడు కూడా ప్రతి విషయాన్ని తనకి చెప్పాడని ఆమె అన్నారు. తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి. ఎవరు పెళ్లిని వ్యతిరేకించకూడదని ఫిక్స్ అయ్యాం ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డామని ఆమె అన్నారు. నవభారతం సినిమా టైంలో తన ఇద్దరు పెళ్లి కాకుండా ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని అన్నారు. ఆ టైంలో ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ అయిపోయామని చెప్పారు.
Advertisement
Also read:
అయితే రాజశేఖర్ కి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందట. అప్పుడు అంబాసిడర్ కార్లో ఎప్పుడు జీవిత రాజశేఖర్ పక్కనే కూర్చునేదట. కానీ ఆ సమయంలో ఆమె కూర్చుని ఈమె వెనక కూర్చోవాల్సి వచ్చిందని జీవిత ఫీలయ్యారు. తర్వాత మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. గొడవలు అయ్యాయి. దీంతో రాజశేఖర్ ఓపెన్ అయిపోయారు. జీవితాని దూరం పెట్టడం తన వల్ల కాదని తెగించి చెప్పేసారు. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ తరవాత యాక్సిడెంట్ జరిగిందని.. దీంతో రాజశేఖర్ దాదాపు నెలరోజులు హాస్పిటల్ లోనే ఉండిపోయారని.. మా బంధం ఇంకా స్ట్రాంగ్ గా మారిందని జీవిత అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!