Advertisement
వెస్టిండీస్ పర్యటనలో గురువారం తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆడడానికి వచ్చినప్పుడు సంజూ శాంసన్ జెర్సీ వేసుకు వచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. సరైన సైజ్ అందుబాటులో లేదని అందుకు స్నేహితుడి జెర్సీ వేసుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. అలానే ఇంకొకటి కూడా చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా తో యాషెస్ సిరీస్ లో బాగంగా జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు లో ఇంగ్లండ్ జట్టు ప్రయోగం చేసింది.
Advertisement
Advertisement
అల్జీమర్స్ తో బాధ పడుతున్న వాళ్ల కి అండగా నిలిచేందుకు ఇంగ్లిష్ ఆటగాళ్లు సహచరుల తో ఇలా జెర్సీ స్వాపింగ్ చేసుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో జెర్సీ వేసుకున్నాడు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏమో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ జెర్సీ వేసుకున్నాడు. మతిమరుపుతో బాధపడుతున్న వారికి సూచనా ప్రాయంగా ఇలా చేసినట్టు కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ చెప్పారు.
Also read: