Advertisement
నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
Advertisement
read also : ఈ వారం విడుదలకు సిద్ధమైన సినిమాలు ఇవే..!!
జూనియర్ నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి హిట్ కొట్టి టాప్ హీరో అయ్యాడు. ఇక ప్రస్తుతం టాప్ హీరోగా నిలిచాడు ఎన్టీఆర్. ఇది ఇలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి, వ్యక్తిత్వం అతని మర్యాద-నిరాడంబరత, నలుగురిలో ఉన్నప్పుడు అతను నడుచుకునే విధానం అతనికి ఒక బహుభాషా పరిజ్ఞానం అతనికి వ్యక్తిగా మంచి గుర్తింపుని ఇచ్చాయి.
Advertisement
నవంబర్ ఒకటవ తేదీన జరిగిన పునీత్ రాజ్ కుమార్ ‘కర్ణాటక రత్న’ ఉత్సవంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిరాడంబరత గల మనిషి, అనర్గల బహుభాషా కోవిదుడు అనేది తన చర్యలతో మరోసారి గుర్తు చేశారు. వేదిక పైన రజనీకాంత్, ఇన్ఫోసిస్ సుధా మూర్తి, పునీత్ రాజ్ కుమార్ గారి వైఫ్ కి తారక్ ఇచ్చిన మర్యాద, వారితో అతను నడుచుకున్న విధానం, అంతేకాకుండా కన్నడ నాట, పునీత్ రాజ్ కుమార్ గురించి కన్నడలో అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సంస్కారం, నిరాడంబరత గల మనిషి, ఎలాంటి బహుభాషా కోవిదుడు అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఓసారి చూసేయండి.