Advertisement
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున శివుడు మరియు తల్లి పార్వతి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివారాధనకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తుంది. అయితే ఈ పవిత్రమైన పర్వదినాన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడని, అంతేకాకుండా ఈ పండుగ శనివారం రోజున రావడంతో మీకు శని దేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతున్నారు.
Advertisement
Read also: కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?
అయితే ఈ మహా శివరాత్రి పర్వదినాన దానం చేయవలసిన వస్తువులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హిందూమతంలో గోవును గోమాతగా పూజిస్తారు. అందుకే మహాశివరాత్రి రోజున గోవుకు రొట్టెలు, మేతను తినిపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి. ఆ మహా దేవునికి పాలు అంటే చాలా ప్రీతి. అందువల్ల మహాశివరాత్రి రోజున పాలను, లేదా పాలతో తయారుచేసిన వస్తువులను దానం చేయడం వల్ల బోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినాన పేదవారికి బియ్యం, పంచదార, పాల వంటివి ధానం చేయడం వల్ల ఆ మహా శివుని అనుగ్రహం లభిస్తుంది.
Advertisement
అంతేకాదు ఈ రోజున పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరిగి మీ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన బిల్వపత్రాలతో శివుని పూజించి, రాత్రి మేల్కొని మంత్రాలని జపించిన వ్యక్తికి శివుడు ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. ఈరోజు భక్తులు ఉపవాసంతో పాటు ఆ పరమ శివుడికి జలాభిషేకం చేయడం, పూర్తి భక్తితో చేసే ప్రార్థనలు కచ్చితంగా అంగీకరించబడతాయి. ఈ విషయాలను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తెలుసుకొని పాటించాలని సూచిస్తున్నారు.
Read also: పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్