Advertisement
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో అనూహ్యంగా దూకుడు పెంచింది అధికార పార్టీ టిఆర్ఎస్. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలను మళ్లీ కారు ఎక్కిస్తున్నారు.
Advertisement
ప్రచారాన్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలో ప్రచార హోరుతో దూసుకెళ్తున్నాయి. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాన్ని మార్చాలంటూ రాష్ట్ర నేతలకు బిజెపి అధిష్టానం ఆదేశాలు పంపింది. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరగనుండగా, నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం లోపే ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేఏపాల్ హల్ చల్ చేశారు.
Advertisement
నన్ను ఎవరు ఆపొద్దు, నేనే కాబోయే తెలంగాణ సీఎం అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరు లో కేఏ పాల్ రెచ్చిపోయారు. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజు నా ఫాలోవర్ అంటూ, విధుల్లో ఉన్న ఓ అధికారిపై తన ప్రతాపం చూపాడు. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ, వాగ్వివాదానికి దిగారు. కాగా కే ఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచారం నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ ఆల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజు నా ఫాలోవర్, నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్న, నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారిని నీ పేరు ఏంటి అంటూ అధికారి మెడలోని ఐడి కార్డు లాక్కొని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు, కేఏ పాల్ కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
READ ALSO : కేసీఆర్ కు షాక్.. బిజేపిలోకి 4 గురు మాజీ ఎంపీలు, ఇద్దరు మంత్రులు ?