Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంత సీరియస్ గా రాజకీయాలు నడిపినా.. కామెడీగానే తీసుకుంటున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీకి చెందిన ఏ అంశాన్ని వదలకుండా ఈయన స్పందిస్తూ వస్తున్నారు. ఒక్కోసారి స్పాట్ లోకి దిగిపోతున్నారు. మొన్న కొత్త సచివాలయంలో మంటలు చెలరేగగా.. వెంటనే అక్కడకు వెళ్లి హడావుడి చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూలో కోర్టు వరకు వెళ్లారు. కేసీఆర్ వదలనంటూ వెంట పడుతున్నారు.
Advertisement
సచివాలయం విషయంలో ఏకంగా సీబీఐ వరకు వెళ్లారు పాల్. కేసీఆర్ పుట్టినరోజునే సెక్రటేరియట్ ఎందుకు ఓపెన్ చేయాలని ప్రశ్నించిన ఆయన.. ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజునే ప్రారంభించాలని మరోసారి డిమాండ్ చేశారు. కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువని.. సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల కోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.
Advertisement
సచివాలయం బిల్డింగ్ లో అగ్నిప్రమాదంపై విచారణ చేయాలని.. అందుకే సీబీఐకి లేఖ రాశానని తెలిపారు పాల్. ప్రమాదం సమయంలో మీడియాను ఎందుకు అనుమతి ఇవ్వలేదని.. ఈ విషయంపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఈ విషయంపై ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ విషయాలనూ వదలడం లేదు పాల్. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని వదలకుండా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జగన్ బాబాయి వివేకా హత్య కేసు ఓ అస్త్రంగా మారింది.
ఈ కేసులో నిజానిజాలు బయటకు తీసేందుకు ఈ మధ్య సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం, అలాగే, నిందితులకు నోటీసులు పంపడం అన్నీ చకచకా జరిపోయాయి. ఈ నేపథ్యంలో పాల్ స్పందించారు. నాలుగేళ్లయినా ఈ కేసులో న్యాయం జరగలేదని.. అదే అమెరికాలో అయితే రోజుల్లోనే న్యాయం జరిగేదని తెలిపారు. ఒక మాజీ మంత్రిని హత్య చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు.