Advertisement
మునుగోడులో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన పార్టీ అభ్యర్థిగా ముందు గద్దర్ ను ప్రకటించినా.. చివరి నిమిషంలో ఆయన డ్రాప్ అయ్యారు. దీని వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని పాల్ ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. కొత్త కొత్త గెటప్స్ తో ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
ఎన్నికల ప్రచారం మొదలైంది మొదలు.. ఎక్కడ చూసినా పాల్ నామస్మరణ ఉండేలా చూసుకుంటున్నారు. నిత్యం వార్తల్లో ఉండేలా వెరైటీ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఓచోట తీన్మార్ స్టెప్పులు వేశారు. ఇంకోచోట దోశల వేస్తూ కనిపించారు. స్వీట్లు పంచారు. హెయిర్ కటింగ్ షాప్ కి వెళ్లి సందడి చేశారు. అంతేకాదు స్వయంగా చాయ్ పెట్టి ప్రజలకు అందించారు. రైతు మాదిరిగా వేషం కట్టి చేనులో పత్తి తీశారు. సైకిల్ తొక్కుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
Advertisement
తాజాగా గొర్రెల కాపరి వేషంలో కనిపించారు పాల్. ప్రచారంలో భాగంగా ఓచోట గొర్రెల కాపరులు కనిపించగా వారి దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గొల్లకురుమలు రాష్ట్రంలో నరకం అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు బతికి ఉంటున్నాయా? అని ప్రశ్నించారు. చాలావరకు చనిపోతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారని తెలిపారు.
చదువుకున్నవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. డిగ్రీ చేసినవాళ్లకు గొర్రెలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు పాల్. మీరు దొరలు కాబట్టి మీ కుమారుడు, కుమార్తె వేల కోట్లు సంపాదించి విదేశాల్లో తిరుగుతారు.. వీళ్లు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పాల్ మాత్రం ఏదో ఒకటి చేసి నిత్యం వార్తల్లో అయితే ఉంటున్నారు.