Advertisement
Kalki 2898 AD First Review: ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా పక్కా హిట్ అవుతుందని పాన్ ఇండియా లెవెల్లో సినిమా దూసుకెళ్లిపోతుందని భారీ లెవెల్లో కలెక్షన్లను రాబడుతుందని అంటున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్, మహానటి వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో కల్కి 2898 ఏడీ సినిమా భారీ బడ్జెట్ తో వస్తోంది. ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 500 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు.
Advertisement
Kalki 2898 AD First Review: కల్కి రివ్యూ
అశ్విని దత్ కూతుర్లు అయిన ప్రియాంక దత్, స్వప్న దత్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కల్కి 2898 ఏడీ సినిమాను ఇండస్ట్రీలో ఉన్న సన్నిహితులకి స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా చూసిన వాళ్ళలో కొంతమంది తమ అభిప్రాయాన్ని చెప్పారు సినిమాలో తొమ్మిది రకాల యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయని కలియుగంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది సినిమాలో చూపించారని అన్నారు.
Advertisement
Also read:
Also read:
కల్కి ఎలా వస్తాడు అనే పాయింట్ మీద కథ తిరుగుతుందని, సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని వారు తెలిపారు. కథలో భాగంగా వచ్చే బిట్ సాంగ్స్ కూడా గూస్ బంప్స్ ని తీసుకువస్తాయని ప్రభాస్ డైనమిక్ ప్రెజన్స్ హైలైట్ అవుతుందని అన్నారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ సర్ప్రైజ్ గా అనిపిస్తాయని మొత్తంగా సినిమా గొప్ప అనుభూతిని ఇచ్చిందని అంతకుమించి ఏం చెప్పినా తక్కువే అవుతుందని వాళ్ళు అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఏవి చూడండి!