Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ జంట విడిపోతుందో చెప్పలేము. అప్పటివరకు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నాం అంటూ షాక్ ఇస్తారు. ఇక కొంతమంది అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా ఒకరికొకరు దూరంగా ఉంటారు. అయితే మెగాస్టార్ కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ విషయంలో కూడా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏడాది కాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి.
Advertisement
READ ALSO : samantha: ఆ ఒక్క కారణం తోనే తమ సినిమాల్లో నటించడానికి సమంతని మన తెలుగు హీరోలు వద్దు అని అనుకుంటున్నారా?
అంతేకాకుండా శ్రీజ చాలా కాలం నుండి తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు. అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ ను శ్రీజ అన్ ఫాలో చేసింది కూడా. పెద్దలు నచ్చ చెప్పాలని చూసినా ఈ జంట విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ విషయంపై శ్రీజ, కళ్యాణ దేవ్ స్పందించలేదు. ఇక ఇటీవల కళ్యాణ్ దేవ్ తన పాప నవిష్కను మిస్ అవుతున్నట్టు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
Advertisement
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ”ఇతరుల పట్ల ఎందుకు అంత దయ, జాలి చూపించాలంటే వారు ఎదుర్కొంటున్న కష్టాలు, పడుతున్న బాధల గురించి మనకు తెలిసింది గోరంతా, తెలియనిది కొండంత. అందుకే ఎదుటివారిపట్ల మనం జాలిని చూపించాలి” అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ ను షేర్ చేశాడు. కళ్యాణ్ దేవ్ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండానే జనాలు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తుంటారని కళ్యాణ్ దేవ్ ఆ పోస్ట్ షేర్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.
READ ALSO : కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా హీరో రామ్ తన జోబులో రూపాయి కూడా పెట్టుకోరట ఎందుకంటే ?