Advertisement
తెలుగింటి అన్నగారు ఎన్టీఆర్ నటనా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు ఎన్టీఆర్. ఆయన సినిమాల్లో రాణించాక టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపుకు వెళ్లిపోయారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసారు. సినీ రంగంలో ఆయన తరువాత ఆ లెగసీని బాలకృష్ణ కొనసాగించారు. ఆ తరువాత మూడవ తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటారు.
Advertisement
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయమై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు అంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఈ విషయమై అసలు కళ్యాణ్ రామ్ కూడా నోరు మెదపలేదు. వీరిద్దరూ చంద్రబాబు నాయుడు విషయమై ఎందుకు స్పందించలేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. నందమూరి కుటుంబం అంతా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇస్తూ.. వారి కుటుంబం వద్దే ఉండే ధైర్యం చెబుతోంది.
Advertisement
కానీ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ పెదవి విప్పకపోవడంపై రాజకీయ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. హరికృష్ణ మరణం తరువాత ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య బంధం బలోపేతం అయ్యింది. వీరిద్దరూ ఒకే మాటగా సాగుతున్నారు. కళ్యాణ్ రామ్ కు ఉన్న ఆర్ధిక సమస్యల విషయంలో ఎన్టీఆర్ సాయం చేయడంతో పాటు తాను నటిస్తున్న దేవర చిత్రానికి కళ్యాణ్ రామ్ ను నిర్మాత భాగస్వామిగా చేర్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే మాట, ఒకే బాట గా నడుస్తున్నారని.. ఎక్కడకు వెళ్లినా, ఏమి చేస్తున్నా కలిసే ఉంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. మరోవైపు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ను చాలా సార్లు అవమానించారని.. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని..
నారా బ్రాహ్మణికి పోసాని కౌంటర్.. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలవా అంటూ..?
సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు కారణం ఏంటో తెలుసా ?
విజయ్ ఆంటోనీ గారు చేసిన ఆ చిన్న పొరపాటు వల్లనే కూతురు దూరమయ్యారా?