Advertisement
Amigos Review in Telugu: కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం అమిగోస్. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ అశీకా రంగనాథ్ నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం ఫిబ్రవరి 10న ( ఈరోజు) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడినట్టేనా? ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: బాలయ్య బాబు “అఖండ” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?
కథ మరియు వివరణ:
Advertisement
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. సిద్ధార్థ అనే బిజినెస్ మాన్ గా, మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో, మైఖేల్ అనే గ్యాంగ్ స్టార్ గా మూడు సరికొత్త పాత్రలలో మెప్పించాడు. ఈ ముగ్గురు ఎదురైన తర్వాత జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ ముగ్గురి మధ్య రక్తసంబంధం ఉందా? లేక కేవలం పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా? ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్ర అయిన మైఖేల్ తనలా ఉండే ఆ ఇద్దరి పాత్రను ఎలా ఉపయోగించుకున్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మూవీ రన్ టైం విషయానికి వస్తే ఈ చిత్రం 139 నిమిషాల నిడివి కలిగి ఉంది.
పాత్రల పరిచయం, ఇంటర్వెల్ పరవాలేదనిపించింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సాధారణంగా ఉంది. గ్యాంగ్స్టర్ మైఖేల్ ఈ ఇద్దరిని ఎలా వాడుకుని ఎన్ఐఎ వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు? అది ఎంతవరకు వర్కౌట్ అయింది? ఈ మూడు పాత్రలు ఎదురైన తరువాత వారి జీవితంలో జరిగిన సంఘర్షణలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో పాజిటివ్, నెగిటివ్ పాత్రల్లో హీరో కం విలన్ గా అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ ఆషిక గ్లామర్ బాగా ప్లస్ అయింది. జిబ్రాన్ సంగీతం కూడా సినిమాకి కలిసి వచ్చింది. ఓవరాల్ గా బిబిసార తరువాత కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ మరోసారి బాగుందని అనిపించింది.
ప్లస్ పాయింట్లు:
కళ్యాణ్ రామ్ నటన
కామెడీ సీన్లు
మైనస్ పాయింట్లు:
రొటీన్ నేరేషన్
ఊహించదగిన స్క్రీన్ ప్లే
రేటింగ్: 3/5
Read also: డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!