Advertisement
‘ జెంటిల్ మేన్’, ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1992 ప్రాంతంలో దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో అధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా జెంటిల్ మేన్ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1993 లో అత్యధిక వసూళ్లను సాధించడమే కాకుండా అవార్డుల పంట పండించింది. జెంటిల్ మేన్ హిందీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అదే పేరుతో తిరకేక్కింది. అక్కడ కూడా మంచి విజయాన్నే అందుకుంది.
Advertisement
Also Read: అశ్విని దత్ : రంగీలా మూవీ ఈ స్టార్ హీరోలతో చేయాలనుకున్నా.. కానీ చివరికి..!!
ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే, అప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శంకర్, ‘జెంటిల్ మేన్‘ కథను సిద్ధం చేసుకున్నారు. ఆయనే ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ కథలో హీరో పాత్ర కోసం మొదట కమల్ హాసన్ ను అనుకున్నారు. కథతో కమల్ హాసన్ దగ్గరకు వెళ్లారు. ఆ కథ విన్న కమల్ హాసన్ కథ నచ్చలేదని శంకర్ ముఖం మీదే చెప్పేశారు.
Advertisement
కథలో మార్పులు కూడా చేయమని సలహా ఇచ్చారు. మార్పులు చేసిన కథ అర్జున్ దగ్గరకు వెళ్ళింది. ఆయన ఓకే చేశారు. తాను ‘జెంటిల్ మేన్’ కథను రిజెక్ట్ చేసిన సంగతిని కమల్ హాసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అది పాత ఇంటర్వ్యూ అయినప్పటికీ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోతో కమల్ హాసన్ మాట్లాడుతూ, “శంకర్ మొదట ఓ బ్రాహ్మణ కుర్రాడి ఉగ్రవాదం గురించి కథ చెప్పాడు. కథ నచ్చక ఇష్టం లేదు. చేయలేను అని చెప్పా. ఆ కథను సినిమాగా తీయాలనుకుంటే కథలో మార్పులు చేయమని సలహా ఇచ్చా” అని అన్నారు.
Reas Also : మెగా ఫ్యామిలీ కోడలిగా మారుతున్న తెలుగు యాంకర్ !