Advertisement
సమాజంలో వివాహేతర సంబంధాలు కనీసం మనుషుల మధ్య ప్రేమానురాగాలు కూడా లేకుండా చేస్తున్నాయి. సాటి మనిషని కూడా చూడకుండా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భర్తలను భార్యలను కడతేరుస్తున్నారు. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ (36) అదే గ్రామానికి చెందిన దుర్గా భవానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు గ్రామంలోనే కాపురం ఉన్నారు. ఆ తర్వాత జగద్గిరి గుట్ట లోని ప్రసన్న నగర్ లో కాపురం పెట్టారు.
Advertisement
అయితే జయకృష్ణ అల్విన్ కాలనీలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. దుర్గ భవాని హౌస్ వైఫ్.వీరి జీవితం హ్యాపీగా సాగుతుంది. జయకృష్ణ స్నేహితుడైన చిన్నా అనే వ్యక్తి ఎప్పుడు వీరి ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు.. ఈ క్రమంలోనే దుర్గ భవాని తో చిన్నాకు అక్రమ సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండా చీకటి వ్యవహారాలు నడిపిస్తూ వచ్చింది దుర్గ భవాని. అయితే జయకృష్ణకు కాస్త ఇబ్బందులు తలెత్తడంతో గ్రామానికి వెళ్దామని భార్య కి చెప్పారు. కానీ ఆమె వద్దని నిరాకరిస్తోంది. దీంతో దుర్గా భవాని తన ప్రియుడికి ఈ విషయాన్ని చెప్పింది. గ్రామానికి వెళ్తే మనం కలవడం కష్టమని భావించిన వీరు ఎలాగైనా జయకృష్ణను లేపేయాలని ప్లాన్ వేశారు.
Advertisement
అలా జయకృష్ణకు ఫుల్ గా మద్యం తాగించి మత్తు లోకి వెళ్ళగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నా భర్త అప్పుల బాధతో చనిపోయాడంటూ సీన్ క్రియేట్ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంతా గమనించారు. ఎందుకో దుర్గ భవాని మాటల్లో వారికి అనుమానం కలిగింది. వారి స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారు. చివరికి అసలు విషయాన్నీ ఒప్పుకుంది. దీంతో దుర్గ భవానిని మరియు చిన్నాని అరెస్టు చేసి జైలుకు పంపారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :