Advertisement
కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా “కాంతార”. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడ నాట అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మూవీ మేకర్స్ ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేశారు. కథ బాగుంటే ప్రేక్షకులు ప్రాంతీయ బేధాలు లేకుండా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయింది. కర్ణాటకలోని గ్రామీణ సాంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగిస్తుంది.
Advertisement
కేజిఎఫ్ చిత్రాలను తెరకెక్కించిన హోం భలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్ల కలెక్షన్స్ అందుకుని దూసుకుపోతుంది. ఇక విడుదలైన ప్రతి చోట వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీక్షించారు. ఈ బుధవారం బెంగుళూరులో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి ఆమె సినిమాను చూశారు. ఇక ఈ సినిమాలో ముందు హీరో రిషబ్ కాదట. ఈ సినిమాకు రిషబ్ దర్శకత్వంతో పాటు హీరో గాను నటించిన విషయం తెలిసిందే.
Advertisement
అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ అనుకున్నారట. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగానే అనుకున్నారట. అందుకోసమే హోం భలే ప్రొడక్షన్ హౌస్ ను సంప్రదించాడు. అన్ని కుదిరిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే ఇదే విషయం పునీత్ రాజ్ కుమార్ తో చెబితే, ఆ మట్టి వాసన బాగా పండాలంటే, హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట. దాంతో రిషబ్ ఈ సినిమాలో హీరోగాను నటించాడట.
Read Also : మునుగోడులో రుజువైన ‘‘COPACT’’ సర్వే