Advertisement
కన్నడ సినీ పరిశ్రమలు కేజిఎఫ్ తర్వాత “కంతారా” మూవీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. కన్నడ వెర్షన్ లో ఇంగ్లీష్ టైటిల్స్ తో రిలీజ్ అయిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మైమరిపించాడు.
Advertisement
ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్ సంస్థ అనువాద రూపంలో విడుదల చేసింది. ఎందుకని కాంతారా భాషతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానిని అలరించిందో చూద్దాం.
కథ మరియు విశ్లేషణ:
కాంతారా అంటే అడవి అని అర్థం. లోకల్ కంటెంట్ తో ఈ సినిమా పేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణ కన్నడలోని భూతకోల, కంబల, కోళ్ల పందాలను చిత్రంలో చక్కగా చూపించారు. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. కథలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తాడు దర్శకుడు. ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, అటవీ, భూమి అక్రమణాల గురించి చెబుతూనే, జానపద సాహిత్యం, భూత కోల, దైవారాధన, నాగరాధన, కంబల వంటి స్థానిక సంస్కృతులను చూపిస్తాడు దర్శకుడు.
Advertisement
అటవీ సంపద స్మగ్లింగ్, గ్రామీణ నేపథ్యం, తీర ప్రాంతంలో తరతరాలుగా పాటిస్తున్న భూత కోలాను చాలా చక్కగా చూపించారు. ఈ సినిమాలోని కన్నడ భాష కూడా, స్థానిక దక్షిణ కన్నడ యాసలో ఉంటుంది. కానీ స్థానిక సాంస్కృతిని ప్రదర్శించాలనే ఉత్సాహంతో కొన్ని పద్ధతులను గ్లామరైజు చేసినట్టుగా అనిపిస్తుంది. కమర్షియల్ ఫ్రేమ్ వర్క్ ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కథ చూసేందుకు ఎక్కడ తెలిసినట్లు కనిపించదు. కానీ, ఎంతో భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. పల్లెటూరు, అడవిలో నివసించే, ప్రజల ప్రేమ, అమాయకత్వం, నమ్మితే ఏదైనా చేసే మనస్తత్వం, గుండెను తాకుతాయి. రిషబ్ శెట్టి, నటన, దర్శకత్వ ప్రతిభ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం బాగా ఆకట్టుకుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది. నటీనటుల నటన, క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి. నటి నటుల పరిచయం అంతగా తెలియకపోవడంతో కాస్త కొత్తదనంగా అనిపించింది. కొన్ని మార్పులు ఉంటే మరింత బాగుండేది.
రేటింగ్: 4/5
READ ALSO : ఆంధ్రప్రదేశ్: మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?