Advertisement
2022 సౌత్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో కాంతారా మూవీ కూడా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అనుమానాలు లేవు. తాజాగా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ప్రతి బయ్యార్ రెండింతల లాభాలను అందుకున్నారు.
Advertisement
ALSO READ:భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్ళడు..!!
అయితే ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అనువదించి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది హర్రర్ మూవీ అయితే కాదు. కానీ ఫీలింగ్ మాత్రం ఆ లెవల్లో కలుగుతుంది. ఇలాంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం అయితే కాదు. గొప్పతనం అని చెప్పవచ్చు. కాంతారా తెలుగు వర్షంలో డబ్బింగ్ చెప్పినవారు వారి టాలెంట్ తో పాత్రకు జీవం పోశారని చెప్పవచ్చు. హీరో రిషబ్ శెట్టి పోషించిన శివ పాత్రకు డబ్బింగ్ చెప్పింది భార్గవ్.
Advertisement
హీరోయిన్ సప్తమి గౌడ పోషించిన లీలాపాత్రకు డబ్బింగ్ చెప్పింది హరిణి. అలాగే హీరో తల్లి మానసి సుదీర్ పోషించిన కమల పాత్రకు డబ్బింగ్ చెప్పింది క్రాంతి. విరు చాలా చక్కగా డబ్బింగ్ చెప్పి సినిమాకు ప్రధాన పిల్లర్స్ గా నిలిచారు. అయితే సినిమా సూపర్ హిట్ అవడంతో ముఖ్యంగా ఈ డబ్బింగ్ ఆర్టిస్టులకు వారు చెప్పిన డబ్బింగ్ కంటే పది రెట్లు పేరు వచ్చిందని వారు సంతోష పడుతున్నారు.
ALSO READ:మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుంటే ఎలా ఉంటారో తెలుసా..